పసిడి ప్రియులకి రిలీఫ్..!

-

గత నాలుగు రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతూనే వుంది. కానీ నేడు ఏ మాత్రం పెరగకుండా నిలకడగానే కొనసాగింది. దీనితో పసిడి ప్రేమికులకు ఊరట కలిగింది అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.49,590 వద్దనే బంగారమా ఆగింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ.45,450 వద్ద స్థిరంగా ఉంది. ఇందులో ఏ మార్పులు లేవు.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన కారణాల వలన బంగారం ధరపై ప్రభావం చూపిస్తాయి అని మనకి తెలుసు.

ఇది ఇలా ఉండగా మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో మాత్రం బంగారం ధర పడి పోయింది. అక్కడ ధరల గురించి కూడా మనం చూస్తే… బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1871 డాలర్లకు తగ్గింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో ధరలు అలానే వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news