దశాబ్ధం కాలం పాటు హీరోయిన్ గా నటిస్తూ అందరి స్టార్స్ తో నటించి మెప్పించిన ఓ అమ్మడు ఈమధ్య కెరియర్ దాదాపు అటకెక్కింది అనుకున్న టైంలో మళ్లీ ఊపందుకుంది. ఇక లేటెస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ ఓ కుర్ర హీరోతో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒక సినిమా ఆల్రెడీ రిలీజై ఫ్లాప్ అవగా ఆ హీరోతోనే తన తర్వాత సినిమా చేస్తుంది.
రెండు సినిమాలు వెంట వెంటనే చేయడం వల్ల ఆ హీరోయిన్ ప్రేమలో ఆ యువ హీరో పడ్డాడట. ఆమె కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడట. అంతేకాదు ఇద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ కూడా నడుస్తుందని అంటున్నారు. ఆల్రెడీ అందరి హీరోలతో నటించిన అమ్మడు ఈ యువ హీరోకి లాక్ అవడం అందరిని షాక్ ఇస్తుంది.
అయితే అతనో నిర్మాత కొడుకు కాబట్టే ఆమె అతన్ని వల్లో వేసుకుందని అంటున్నారు. ఈమధ్య సదరు హీరో బర్త్ డే రోజు కూడా ఆమె వచ్చి విష్ చేసింది. మరి టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్.. కుర్ర హీరో ప్రేమ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.