వేములవాడలో దారుణం.. కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని తీసుకెల్లి నిర్భందం..!

-

మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. కొడుకు తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్భన్ మండలంలో చోటు చేసుకుంది. ఈ అవమానీయ ఘన పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండపని మేస్త్రీగా పని చేస్తున్నాడు. మహారాష్ట్ర కు చెందిన లాలు దేవకర్ అండ్ టీమ్ కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. దీని కోసం కూలీలు అవసరం ఉండగా.. శ్రీను అతడి సోదరుడిని సంప్రదించాడు.

ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు ఛతీస్ గడ్ లో కూలీ పనులు చేస్తున్నారు. లాలు దేవకర్ కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన లేబర్ పురమాయించేందుకు చతీస్ గడ్ కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు. దీనికి లాలు దేవరక్ రూ.3.80 లక్షలు కూలీలకు చెల్లించాడు. కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవరకర్ కు, శ్రీను, అతడి సోదరుడికి మధ్య వివాదం చోటు చేసుకుంది. డబ్బులు తిరిగి చెల్లించాలని లాలు దేవకర్ శ్రీను, అతని సోరుడిపై ఒత్తి చేశారు. వారు ఇంటివద్ద లేకపోవడంతో ఇంట్లో ఉన్న శ్రీను తల్లి పల్లపు భీమా బాయ్ ని బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ నకు పాల్పడ్డారు. డబ్బులు ఇచ్చి తల్లిని తీసుకెల్లాలని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దౌర్జన్యంగా భీమాబాయ్ను తీసుకెల్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news