దేశంలో అత్యంత భద్రత, రక్షణ ఉన్న నగరాల్లో తిరుపతికి రెండో స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా 111 నగరాల్లో భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ స్థాయిల్లో పరిశీలించి ర్యాంకులను ప్రకటించింది. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆటో స్టాండ్, ట్యాక్సీ ప్రయాణాలు, హోటల్స్..పోలీసులు అనుసరిస్తున్న భద్రత విధానాలను పరిగణలోకి తీసుకున్నారు. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకుర్ హర్షం వ్యక్తం చేసి.. పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాలో తిరుపతికి ఇప్పటికే నాలుగో స్థానం లభించిన విషయం తెలిసిందే.