ఇండస్ట్రీకి మరో స్టార్ వచ్చాడు : చిరంజీవి

-

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ రీసెన్ గా గీతా గోవిందం సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఆ సందర్భంగా ఆదివారం జరిగిన సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

విజయ్ గురించి చిరు మాట్లాడుతూ అర్జున్ రెడ్డితో యువత మనసులు గెలిచిన విజయ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు. ఈ సినిమా సక్సెస్ చూస్తే విజయ్ కు స్టార్ట్ స్టేటస్ వచ్చేసినట్టే అన్నారు చిరంజీవి. తన కెరియర్ లో ఖైది, చట్టానికి కళ్లులేవు ఇలాంటి సినిమాలు చేస్తున్న టైంలో విజేత లాంటి ఫ్యామిలీ మూవీ చేయడం రిస్క్ అని తెలిసి చేశాను. ఆ సినిమా కూడా అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చింది.

ఆ సినిమా సక్సెస్ తనని ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసింది. అలానే ఇప్పుడు విజయ్ కు గీతా గోవిందం సక్సెస్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేసింది. ఇక సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పి సినిమా కథను ఒక్క లైన్ లో చెప్పారు చిరంజీవి.

పవన్ అత్తారింటికి దారేది సినిమాలానే ఇది కూడా లీక్ అవడం సెంటిమెంట్ గా భావించమని అరవింద్ కు చెప్పారట చిరంజీవి. అయితే ఇండస్ట్రీ ఎన్నో కుటుంబాలకు అన్నం పెడుతుందని ఇలాంటివి చేసే వారికి ఇకనుండి శిక్ష మరింత కహ్ఠినంగా ఉంటుందని అన్నారు. మొత్తానికి చిరు ఎనౌన్స్ మెంట్ తో విజయ్ స్టార్ అని చెప్పడం అతని ఫ్యాన్స్ ను మెప్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news