హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది ఇప్పుడు ఆందోళనకరంగా కనపడుతుంది. అక్కడ నదిలో పచ్చగా ఉన్న నాచు దుర్వాసన కూడా వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు మరియు సరస్సుల నుండి నాచు అక్కడికి చేరుకోగా అది గంగా నది మొత్తం కూడా వ్యాపించింది. ప్రధానంగా వారణాసి ప్రాంతంలో ఉన్న ఘాట్ లలో అది దుర్వాసన వస్తుంది.
గత ఏడాది ఏప్రిల్ మరియు మే నెలల్లో కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో గంగా నది చాలా పరిశుభ్రంగా కనపడింది. ఆ నీటిని డైరెక్ట్ గా తాగవచ్చు అని కూడా చెప్పారు. తక్కువ కాలుష్యం కారణంగా, గంగా నది కూడా తనను తాను శుభ్రం చేసుకుంది అనే కథనాలు కూడా వచ్చాయి. ఇది అంతా సహజం అని కాని నీరు విషపూరితంగా ఉంటుంది కాబట్టి స్నానం చేయవద్దు అని అధికారులు సూచించారు. ఏప్రిల్, మే నెలల్లో ఇలా జరుగుతుందని అధికారులు చెప్పారు.