సోషల్ మీడియా ఎంట్రీతో ప్రపంచం చిన్నగా మారిపోయింది. ఏ సమాచారమైనా కాశ్మీర్ టూ కన్మాకుమారి క్షణాల్లో చక్కర్లు కొట్టేస్తుంది. ఇలా సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు జరుగుతున్నదనేది నిజం. వాట్సాప్ వాడకంలో ఎన్నో అపోహలు సందేహాలు.
అవును ప్రైవసీ పాలసీలో ప్రభుత్వం, వాట్సాప్ దిగ్గజం నడుమ జరుగుతున్న వాదోపవాదాల నడుమ, మరో సందేహం. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం ఇక మన వాట్సాప్ ఖాతాను బ్యాన్ చేయనుందా? వాట్సాప్ కూడా త్వరలో బ్లాక్ అయిపోతుందా..? ఇక ఈ మధ్య, వాట్సాప్ కోసం నోటిఫై చేయబడిన కొత్త నిబంధనల గురించి ఓ సందేశం చెలామణి అవుతూ ఉంది. ప్రభుత్వం అన్ని వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేస్తుందని, మొబైల్స్ మంత్రిత్వ శాఖకు కనెక్ట్ అవుతాయని, మీరు వాట్సాప్ చేసిన మెసేజ్ కు మూడు టిక్కులు గక వస్తే మీ మెసేజ్‌ని మంత్రిత్వ శాఖ గమనిస్తున్నట్లని, రెండు బ్లూ మరియు ఒక రెడ్ టిక్ ఉంటే ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తున్నట్లని. చివరగా మూడు ఎర్రటి టిక్స్ ఉంటే ప్రభుత్వం మీపై చర్యలను ప్రారంభించిదని అర్థం అంటూ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.
అయితే ఇది పూర్తిగా అబద్దం.. మోసపూరితమైన సందేశం ఇప్పటి వరకు ప్రభుత్వం వీటిలో దేనినీ నిబంధనలలో తెలియజేయలేదు. కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారు గోప్యతను ప్రభావితం చేస్తాయని పేర్కొంటూ వాట్సాప్ కోర్టుకు వెళ్లినప్పటికీ, దేశం యొక్క సార్వభౌమత్వానికి ముప్పు ఉన్నట్లయితే సందేహాత్మకమైన మెసేజ్ వివరాలను చాట్ ఫోరం నుండి కోరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల విషయంలో, భారతదేశంలో ఒక కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించాలని, గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేయాలని, చట్టపరమైన ఉత్తర్వు వచ్చిన 36 గంటల్లోపు కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది. కాల్స్ రికార్డ్ అవుతాయని ఇది స్పష్టంగా చెప్పలేదు మరియు అదనపు టిక్ వ్యవస్థను ప్రవేశపెట్టడం గురించి కూడా ప్రస్తావించలేదు.
ప్రస్తుతం మీ సందేశానికి వ్యతిరేకంగా రెండు టిక్‌లు వస్తే మెసేజ్ డెలివరీ అయినట్లు సూచిక, డెలివరీ అయిన తరువాత గ్రే కలర్ టిక్స్ ఎదుటి వ్యక్తి ఇంకా చదవలేదని సూచిస్తుంది. ఇక బ్లూ టిక్స్ ఎదుటి వారు మీ సందేశాన్ని చదివినట్లు తెలియజేస్తుంది. అవి స్పష్టంగా నకిలీవి కాబట్టి అలాంటి ఫార్వర్డ్‌లను నమ్మవద్దు. సరైన సమాచారం కోసం ఐటీ రూల్స్ 2021 సరైన ఇన్ఫర్మేషన్ కోసం ఓసారి రెఫర్ చేసుకోవచ్చు.