ఓటుకు నోటు కేసులో అప్పట్లో తెలంగాణ, ఏపీలో ఎన్ని ప్రకంపనలు రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ దీని గురించి ఏది విన్నా అది సంచలనమే. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో స్లోగా విచారణ సాగించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో రేవంత్ రెడ్డికి చార్జీషీట్ దాఖలు చేయడానికి రెడీ అయిపోయింది.
అలాగే ఈ కేసులో నిందితులుగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహా, ముత్తయ్య, వేం కృష్ణకీర్తలన్ లకు షాక్ తగిలింది. వారిని కూడా ఇందులో నిందితులుగా చేర్చించి ఈడీ. అయితే వారిపై ఇంకా చార్జిషీటు దాఖలు చేయలేదని తెలుస్తోంది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఈడీ తన చార్జిషీటులో వివరించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్ కు రూ.50లక్షల ఇచ్చేందుకు ప్రయత్నించారని ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అయితే ఈ కేసులో వెనుకుండి నడిపించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడిని మాత్రం సేఫ్ జోన్లో ఉంచింది ఈడీ. ఆయనపై ఎలాంటి చార్జిషీలు దాఖలు చేయలేదు. అలాగే ఆయన వాయిస్ ఉందని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.