మన శరీరంలో కళ్లు ప్రత్యేక స్థానం. కళ్లు మన ఆత్మకు విండో లాంటిది అంటారు. ఈ కళ్లు సైన్స్‌తో ముడిపడి ఉన్న ఒక గట్టి నమ్మకం ఉంది తెలుసా! మీరెప్పుడైనా ఆకర్షణీయమైన వ్యక్తిని లేదా వస్తువులను చూసినపుడు ఆటోమెటిక్‌గా కనుపాపలు పెద్దవిగా అవుతాయి. అవును మీ కనుపాప మీకు ఏవి ఇష్టమో కూడా చెప్పేస్తాయి. అయితే, యూనైటెడ్ స్టేట్స్కు చెందిన జార్జియా ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా కనుపాపతో ఇంటెలిజెన్సీని కనుక్కోవడాన్ని గుర్తించారు. జాసన్ సుఖారా, రాండల్ ఎంగ్లే శాస్త్రవేత్తలు దీనిపై విస్త్రత పరిశోధన చేశారు.
వీరు ఈ విషయాన్ని అలెగ్జాండర్ బార్గోయ్నే అనే అమెరికన్ ఆర్టికల్‌లో తెలిపారు. కనుపాప పెద్దగా ఉన్న వ్యక్తులను, తక్కువ పరిమాణంలో ఉన్న వ్యక్తికి బేధాన్ని గుర్తించామని చెప్పారు. దీన్ని దాదాపు 500 మంది వ్యక్తులపై ఈ పరిశోధన జరిపారు. అందులో 18–35 వయస్సువారున్నారు. లైటింగ్ డిమ్‌గా ఉన్న లాబోరేటరీలో వారిని బ్లాంక్ కంప్యూటర్ వైపు కాసేపు చూడమన్నారు. ఆ తర్వాత ఐ ట్రాకర్ ద్వారా మేధత్వన్ని పరీక్షించారు. హై పవర్డ్ కెమెరాను కంప్యూటర్‌కు అమర్చారు. అది కంటి కార్నియా, కనుపాపను సులభంగా క్యాప్చర్ చేయగలదు. దీంతో శాస్త్రవేత్తలు ప్రతి వ్యక్తి కనుపాప పరిమాణాన్ని ఐ ట్రాకర్‌తో గుర్తించారు. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పరీక్ష కూడా నిర్వహించారు. అందులో వ్యక్తి ప్రాబ్లంను నివృత్తి చేయాల్సి ఉంటుంది. అటెన్షన్ కంట్రోల్ పరీక్ష ద్వారా కొన్ని అవంతరాల నడుమ వారు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో పరిశోధించారు. చివరగా ‘వర్కింగ్ మెమోరీ కెపాసిటీ’ ద్వారా ఎన్ని రోజులపాటు ఇన్ఫర్మేషన్ను గుర్తుపెట్టుకుంటారో పరిశోధించారు. ఇందులో కనుపాప పెద్దగా ఉన్న వారిలో ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండటం.. అటెన్షన్‌గా ఉండటాన్ని గుర్తించారు. వారికి ఎక్కువ మెమోరీ కూడా ఉందని తెలిపారు. కనుపాప పరిమాణం ఎక్కువ ఉంటే ఎక్కువ ఛాలెంజ్‌లలో విజయం సాధించే కెపాసిటీ ఉంటుందన్నారు.