కేశాలు బలంగా ఉండాలని, మృదువుగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు కేశాలను బలహీనంగా మార్చి ఊడిపోయేలా చేస్తున్నాయి. ఐతే మీకిది తెలుసా? బలమైన కేశాల కోసం మందార పువ్వు పొడి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే మందార పువ్వు పొడి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
తయారీ విధానం
మందర పొడి చేయడానికి ముందుగా తాజాగా ఉన్న మందార పువ్వులను తీసుకోవాలి. ఆ తర్వాత మందారాలను నీటితో శుభ్రంగా కడగాలి. దూదితో మందాలను మెల్లగా తుడవండి. దీనివల్ల మందారాలు పూర్తిగా శుభ్రం అవుతాయి. ఇలా శుభ్రం అయిన మందారాలాను కుండలో ఉంచాలి. ఆ తర్వాత దీన్ని ఎండలో 10రోజులు ఉంచాలి. మందారాలు పొడిగా మారిన తర్వాత రుబ్బుకుంటే బాగుంటుంది. అప్పుడే ఇది పొడిగా మారుతుంది.
ఎలా వాడాలంటే:
వెంట్రుకలకు ఆయిల్ పెట్టుకునే అలవాటు అందరికీ ఉంటుంది. ఆ నూనెలో ఈ మందార పొడిని కలుపుకోవాలి. ఆ తర్వాత నెత్తిపై మసాజ్ చేయాలి.
ప్రయోజనాలు
ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెలనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల జుట్టు సహజ రంగు కోల్పోకుండా ఉంటుంది.
ఇది కాకుండా కలబంద రసాన్ని మందార పొడిలో కలుపుకుని నెత్తిమీద మసాజ్ చేయాలి. ఇది చుండ్రును బాగా తగ్గిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా జుట్టు బలంగా మారుతుంది. అంతేకాదు జుట్టు రాలిపోయే సమస్యలు సహా, తెల్లబడడం కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్యలు తొలగిపోయి బలమైన కేశాలు తయారవుతాయి. జుట్టు సమస్యలతో ఇబ్బందులుగా ఉంటే, మందార పొడి ప్రయత్నించి చూడండి.