బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ లాంచ్‌కు అన్ని అడ్డంకులు తొల‌గిన‌ట్లే..?

-

ప‌బ్‌జి మొబైల్ ఇండియాను బ్యాన్ చేసిన త‌రువాత క్రాఫ్ట‌న్ కంపెనీ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరిట గేమ్‌ను మ‌ళ్లీ లాంచ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. గేమ్‌కు గాను ఇప్ప‌టికే మే 18వ తేదీ నుంచి ప్రీ రిజిస్ట్రేష‌న్లు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో ప‌బ్‌జి ప్రియులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కొత్త గేమ్ లాంచింగ్‌కు ఉన్న అన్ని అడ్డంకులు ఇక తొల‌గిన‌ట్లేన‌ని తెలుస్తోంది.

battlegroudns mobile india game may launch soon

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను లాంచ్ చేయ‌డంపై జేఎన్‌యూకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ గౌర‌వ్ త్యాగి ఆర్‌టీఐ ద్వారా స‌మాచారం సేక‌రించారు. కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా ఆయ‌న‌కు స‌మాధానం వ‌చ్చింది. ఏ యాప్‌ను అయినా స‌రే దేశంలో లాంచ్ కాకుండా ఆపే అధికారం త‌మ‌కు లేద‌ని, కానీ ఉన్న యాప్‌ల‌ను నిషేధించే హ‌క్కు త‌మ‌కు ఉంద‌ని తెలిపింది. ఐటీ యాక్ట్ 2000 సెక్ష‌న్ 69ఎ ప్ర‌కారం దేశ స‌మ‌గ్ర‌త‌కు, భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగిస్తుంద‌నుకుంటే ఏ యాప్‌ను అయినా స‌రే నిషేధించే అధికారం త‌మ మంత్రిత్వ శాఖ‌కు ఉంటుంద‌ని తెలిపింది.

అయితే క్రాఫ్ట‌న్ కంపెనీ చైనాది కాదు. నేరుగా ఈ గేమ్‌ను లాంచ్ చేస్తుంది. క‌నుక ఈ గేమ్ బ్యాన్ అయ్యే అవ‌కాశం లేన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించార‌ని, నేడో, రేపో గేమ్ లాంచ్ అవుతుంద‌ని తెలిసింది. జూన్ 18వ తేదీన గేమ్ ను లాంచ్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి కొత్త గేమ్ స‌జావుగా లాంచ్ అవుతుందా, ఏవైనా అడ్డంకులు మ‌ళ్లీ వ‌స్తాయా ? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news