విడుద‌ల‌కు రెడీ అవుతున్న సినిమాలు.. ఏవేవంటే..?

-

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీని క‌రోనా వ‌చ్చి కుదిపేసింద‌నే చెప్పాలి. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు కూడా దీని దెబ్బ‌కు ఆగిపోయాయి. ఇంకా ఎన్నో మూవీలు రిలీజ్‌కు రెడీ ఉండి వాయిదాలు ప‌డుతున్నాయి. ఎప్పుడెప్పుడు క‌రోనా త‌గ్గుతుందా అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. త‌గ్గితే సినిమాలు విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు టైమ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

సినిమాలు

ప్ర‌స్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ మెల్లిగా త‌గ్గుతుండ‌టంతో సినిమా యాక్టివిటీ కొద్ది కొద్దిగా పెరుగుతోంది. రానున్న పదిహేను రోజుల్లో థియేరట్ల ఓపెనింగ్ కూడా జ‌రుగుతుంద‌ని వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. యంగ్ స్టార్ల సినిమాలు విడుద‌ల‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి.

త్వ‌ర‌లోనే నాని న‌టించిన టక్‌ జగదీష్ తో పాటుగా నాగ చైతన్య సాయి పల్లవి యాక్ట్ చేసిన లవ్‌ స్టోరీ మూవీలు విడుద‌ల‌వ్వ‌బోతున్నాయి. అలాగే రానా విప్ల‌వ‌ నేప‌థ్యంలో తీసిన విరాటపర్వం, వెంకీ మామ నారప్ప మూవీలు ఇప్ప‌టికే వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే వీటిని త్వ‌ర‌లోనే విడుద‌ల చేసేందుకు ప్లాన్‌చేసుకుంటున్నారు మూవీ మేక‌ర్స్‌. వీటితోపాటే మెగాస్టార్ ఆచార్య మూవీ కూడా వ‌చ్చే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news