గోసేవ చేయండి మంచి ఫలితం వస్తుంది!
మేషరాశి: మిత్రులతో వ్యసనాలు, వాహన మార్పులు, పనులు చేయడంలో నిర్లక్ష్యం, చిన్నచిన్న సమస్యలు. పరిహారం ఇష్టదేవతారాధన చేయండి. వీలైతే దేవాలయానికి వెళ్లి 9 ప్రదక్షిణలు చేయండి.
వృషభరాశి: జయం, పనులు సజావుగా సాగుతాయి. బంధువర్గం, అధికారుల వల్ల ధనలాభం. ఆప్తులకు సహాయం చేయండి.
మిధునరాశి: ప్రతికూలంగా ఉంటుంది. అకారణంగా అపవాదులు, తొందరపాటు నిర్ణయాలు, కీర్తినష్టం. పరిహారం నవగ్రహ ప్రదక్షిణలు లేదా అశ్వత్థ (రావి)చెట్టుకు ప్రదక్షిణ చేయండి.
కర్కాటకరాశి: శుభమూలక ఖర్చులు, బంధువుల రాక, కళత్ర అనారోగ్యం. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన/విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
సింహరాశి: కార్యజయం, మనో ఉత్సాహం, స్త్రీమూలకంగా ధనలాభం. ఇష్టదేవతారాధన చేసుకోండి.
కన్యారాశి: శుభమూలక ధనలాభం, చేపట్టిన పనులు పూర్తి. ఇతరులకు ఆర్థికంగా సహాయం అందిస్తారు. చిన్నచిన్న ఆరోగ్యసమస్యలు. పరిహారం తులసి చెట్టుకు నమస్కారం/పూజ చేయండి.
తులారాశి: అనుకోని ధనలాభం, పనులు పూర్తి, అధికారులతో పనులు పూర్తిచేసుకునే అవకాశం. మంచి ఫలితాల కోసం అమ్మవారికి పూజ చేయండి.
వృశ్చికరాశి: విందులు, వినోదాలు, ఆనందం. కార్యాలలో వ్యతిరేకం, పనులు ఆగిపోతాయి. దేవాలయ సందర్శన సూచన. పరిహారం సుబ్రమణ్య ఆరాధన లేదా గణపతి ఆరాధన చేయండి.
ధనస్సురాశి: కార్యజయం, ఉత్సాహ వాతావరణం, స్త్రీమూలకంగా ధనలాభం. మంచి ఫలితాల కోసం ఇంట్లో ఎర్రని వత్తులతో దీపారాధన చేయండి.
మకరరాశి: ఆకస్మిక ధన నష్టం, ఇంట్లో శుభకార్యసూచన, పనులకు ఆటంకాలు. స్వల్ప అనారోగ్య సమస్యలు. పరిహారం శనికి పూజ లేదా ప్రదక్షిణలు చేయండి. వీలైతే గోసేవ చేయండి.
కుంభరాశి: కార్యజయం, బంధుమిత్రలు రాక, అనుకోని విధంగా ధనలాభం, ప్రయాణ సూచన. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.
మీనరాశి: ఆందోళన, ప్రతికూల ఫలితాలు, దేవాలయ దర్శన సూచన. మంచి ఫలితాల కోసం గణపతి లేదా దుర్గాదేవి ఆరాధన చేయండి. వీలైతే చండీదీపాలను పెట్టండి మంచి ఫలితం వస్తుంది.
-కేశవ