బీజేపీ మిత్ర ధర్మాన్ని మరిచిపోయిందా?.. జనసేన అసంతృప్తి వెనుక?

-

బీజేపీ మిత్ర ధర్మాన్ని విస్మరించడంపై జనసేన అసంతృప్తిగా ఉందా?. కలిసి చేయాల్సిన ఉద్యమాలు, పోరాటాల్లో వన్ సైడ్‌గా కమలనాధులు కలదలడం జనసేనకు నచ్చడం లేదా?. చివరకు సమన్వయ కమిటీ సమావేశానికి కూడా చొరవ చూపకపోవడం, విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపు‌పై బీజేపీ నేతలు సింగిల్‌గా ధర్నాలు చేయడాన్ని జనసేన నిశితంగా గమనిస్తోందా?. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు డ్యామేజీ కంట్రోల్ కోసం జనసేనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారా?. ఇప్పుడు ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.

అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని జట్టు కట్టిన బీజేపీ, జనసేన మధ్య విభేదాలు ప్రారంభమయ్యామైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీ నేతల మధ్య మాటలు తక్కువ అయ్యాయి. గతంలో మాదిరిగా కలిసి ఉద్యమాలు చేసే పరిస్థితి కనిపించడంలేదు. కరోనా కారణంగా ఇళ్ళ కే పరిమితమై డిజిటల్ మీడియా వేదికగా ఉద్యమాలు నిర్వహించే కాలంలోనూ రెండు పక్షాలు సైలెంట్‌గా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇఫ్పుడిప్పుడే ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు నిరసనకు దిగుతున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న జాబ్ క్యాలెండర్.. విలువ ఆధారిత ఆస్తి పన్ను.. పోలవరం నిర్వాసితుల వ్యవహారంపై బీజేపీ, జనసేన కలిసి కూర్చుని మాట్లాడుకోలేక పోయాయి. బీజేపీ మాత్రం ఇటీవల సమావేశాలు నిర్వహించి ఈ సమస్యలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. బీజేపీ ఈ నిర్ణయం తీసుకునే ముందు గానీ..ఆ తర్వాత గానీ తమను సంప్రదించలేదని జనసేన వర్గాలు అంటున్నాయి .

కరోనా సెకండ్ వేవ్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా కరోనా సోకడంతో.. ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. కరోనా కారణంగా ఏపీలో లాక్ డౌన్ ఉన్నందున..పవన్ హైదరాబాద్ వదిలి రాలేదు. మరో వారం రోజుల్లో అమరావతిలో.. పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.

ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనను కూడా కలుపుకుని వెళ్లాలని నేతలు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత జనసేన నేతలతో బీజేపీ నేతలు మాట్లాడలేదని చెబుతున్నారు. అయితే గతంలో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై చర్చించేందుకు సమన్వయ కమిటీని బీజేపీ, జనసేనకు చెందిన కీలక నేతలతో నియమించారు. ప్రస్తుతం ఆ కమిటీ కూడా లేకపోవడంతో రెండు పార్టీల మధ్య మాటలు కూడా కరువయ్యాయి.

ఇక ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రస్తుతం పోరాటం అవసరమని జనసేన నేతలు అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి రాగానే..రెండు పార్టీల సంబంధాలపై నిర్మొహమాటంగా మాట్లాడాలని జనసేన నేతలు డిసైడయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news