IT Act Section 66A: కేంద్రానికి సుప్రీం కోర్టు ఝలక్‌.. నోటీసులు జారీ

-

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మరో ఝలక్‌ ఇచ్చింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ 2015లోనే సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2000 ఏడాదిలో రూపొందించిన ఆ చట్టం ప్రకారం ఇప్పటికీ కొన్ని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పీపుల్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది.

సుప్రీంకోర్టు

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ ఎప్పుడో రద్దు చేశామని… మరెందుకు ఆ సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ పరిణామాలు దారుణంగా ఉన్నాయని సుప్రీం కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది.

జస్టిస్‌ రోహింటన్‌ నారీమన్‌, కేఎం జోసెఫ్‌, బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసంన ఆ పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. రద్దు అయిన ఆ చట్టం గురించి దేశంలో ఉన్న పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని తన తీర్పులో కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం. కాగా.. 2015 లో రద్దయిన ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని 66-ఏ సెక్షన్‌ కింద దేశ వ్యాప్తంగా 745 కేసులు పెండింగ్‌ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news