హైదరాబాద్: నేడు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ పేరును ఆమె ఖరారు చేశారు. వైఎస్సార్‌టీపీగా తెలంగాణలో ఇవాళ్టి నుంచి షర్మిల పార్టీ ఆవిర్భావంకానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జయంతి సందర్భంగా కాసేపట్లో ఆమె పార్టీని ప్రకటించనున్నారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌కి నివాళులర్పించనున్నారు. 10.30కి ఇడుపుల పాయ నుంచి ఆమె హైదరాబాద్ బయలు దేరనున్నారు.
11.15 కడప ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 1 గంటకి బేగంపేట ఏయిర్ పోర్ట్‌కి చేరుకోనున్నారు. బేగంపేట,అమీర్‌పేట, లాల్‌బంగ్లా మీదుగా పంజాగుట్టకి చేరుకుంటారు. పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున సర్కిల్, మాసబ్ టాంక్, మెహిదీపట్నం మీదుగా జేఆర్సీ సెంటర్‌ల మీదుగా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3 గంటలనుంచి 7 లోపు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. పార్టీ ఆవిర్భావానికి ముఖ్య అతిధిగా వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో 40 మంది కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.