అలెర్ట్ : మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. జార్ఖండ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా & పశ్చిమబెంగాల్ తీరప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్రమట్టము నుండి 3.1 km ఎత్తు వద్ద కొనసాగుతుంది. జూలై 11 న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఏపీలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు తీరం వెంబడి 40-50 kmph, గరిష్టంగా 60 kmph వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news