ముదురుతున్న వివాదం… కేంద్రానికి ఏపీ మరో రెండు లేఖలు

-

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు ముదురుతోంది.  తాజాగా..  కృష్ణానదిపై నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు ఏపీ సీస్ ఆదిత్య నాథ్ దాస్. భారీ ప్రాజెక్టులు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను కాజేస్తోందని ఫిర్యాదు చేశారు. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183 టీఎంసీల నీటిని తెలంగాణా అక్రమంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని జల శక్తి శాఖకు ఫిర్యాదు చేశారు.

Nagarjuna Sagar Dam Water Level Reached

మధ్య తరహా, చిన్న తరహా, ఎత్తిపోతల ప్రాజెక్టులతో తెలంగాణా అనుమతులు లేకుండానే కృష్ణా నది నీటిని వినియోగించుకున్నట్టు లేఖలో సీఎస్ పేర్కొన్నారు. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామల రావు కూడా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news