ఫస్ట్ డేట్ First date కి వెళ్ళేటపుడు అవతలి వారు ఎలాంటి వారనేది ముందే తెలుసుకుంటే చాలా మంచిది. వారు మన ఆలోచన విధానానికి సరిపోతారా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ కొన్ని ఊహలు ఉంటాయి. అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకి అవతలి వారు అందుతారా లేదా అన్నది చూసుకోవాలి. దానికోసం కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీలోని ప్రత్యేకత ఏమిటి?
అవతలి వారి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వారిని మాట్లాడనివ్వాలి. వారి అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు తెలుసుకోవాలి. అప్పుడు వారు ఎంత ప్రత్యేకమో తెలుస్తుంది. ఈ విధంగా మీరనుకున్నదానికి సరిపోతారో లేదో తెలుసుకోవచ్చు.
అసాధారణంగా ఏదైనా చేసారా?
అభిరుచుల గురించి అడిగాక, అందులో అందరి కంటే విభిన్నంగా, హాస్యపూరితంగా ఏదైనా చేసారేమో కనుక్కోండి. సాధారణ సంభాషణలో బయటపడనివి ఇలాంటి సమయాల్లో బయటపడే అవకాశం ఉంది. దానివల్ల అవతలి వారి గురించి మరింత తెలుస్తుంది.
ఏమైనా జోక్స్ చెప్పగలరా?
ఈ ప్రశ్న అడిగినపుడు వారు స్పందించే విధానాన్ని బట్టి వారి సెన్సాఫ్ హ్యూమర్ అర్థం అవుతుంది. ఒక చిన్న జోక్క్ చెప్తే ఇద్దరూ నవ్వారనుకోండి, అపుడు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
నచ్చే హాలీడే స్పాట్
ప్రపంచ గందర గోళాల నుండి దూరం వెళ్ళాలనుకుంటే ఏ ప్రదేశానికి వెళ్తారని ప్రశ్న అడిగితే, వారిచ్చే సమాధానాన్ని బట్టి వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రదేశాలు వారికి ఆనందాన్ని ఇస్తాయో తెలుస్తుంది.
మీ జీవితంలో ప్రత్యేకమైన వారు ఎవరైనా ఉన్నారా?
ఎదుటి వారి పట్ల ఎలా ఉంటారన్నది తెలుసుకోవడానికి ఈ ప్రశ్న ఉపయోగపడుతుంది. అదీగాక ప్రస్తుతం ఇలా ఉండడానికి ఎవరు కారణంగా ఉన్నారో కూడా తెలుస్తుంది. డేటింగ్ లో ముందుకు వెళ్తున్నప్పుడు ఇది చాలా అవసరం అవుతుంది.
మీరు ఏ విషయంలో గర్వంగా ఫీలవుతారు?
అవతలి వారు తమ జీవితంలో తీసుకున్న ఏ నిర్ణయం వల్ల ఆనందంగా ఉన్నారనేది తెలిసిపోతుంది. దానివల్ల వారు దేనికి విలువ ఇస్తున్నారు? దేనికోసం కష్టపడుతున్నారనేది తెలుస్తుంది.