దర్శకరత్న బయోపిక్ కు సన్నాహకాలు..

-

తెలుగు తెర మీద డిఫరెంట్ గా సినిమాలు తీస్తూ… తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నారు టాలీవుడ్ దర్శకుడు, దర్శకరత్న(Darshakaratna) దాసరి నారాయణ రావు. దర్శకుల్లో ఎక్కువ సినిమాలు తీసిన వ్యక్తిగా ఆయన వరల్డ్ రికార్డును కూడా సాధించారు. ఎంతో మంది ఆర్టిస్టులకు, హీరోలకు ఇండస్ర్టీలో లైఫ్ ఇచ్చిన ఈ గొప్ప వ్యక్తి జీవితం బయోపిక్ గా వస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు ధవల సత్యం ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపడతాడని తెలుస్తోంది.

దర్శకరత్న/Darshakaratna
దర్శకరత్న/Darshakaratna

ఇక నిర్మాతగా తాడివాక రమేష్‌ నాయుడు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై ఈ మూవీ రూపుదిద్దుకోనుంది. దర్శకరత్న అనే టైటిల్ ను కూడా ఈ మూవీకి ఖరారు చేశారు. కాగా దాసరి నారాయణ రావు పాత్రలో ప్రముఖ హీరో కనిపిస్తాడని నిర్మాత రమేష్ వెల్లడించారు. దాసరి రనారాయణ రావు గుర్తుగా నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్ కూడా అందజేయాలని ఈ చిత్ర నిర్మాత ప్లాన్ చేస్తున్నాడట. కళాకారులు-సాంకేతిక నిపుణులకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వాలని భావిస్తున్నారట. దీని గురించి రమేష్ మాట్లాడుతూ…. దాసరి నారాయణ రావు పేరు మీద ప్రతి సంవత్సరం ఫిల్మ్ అండ్ టీవీ కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఆయన జీవిత గాధను తెలుగు తెరపై ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ఈ మూవీ అదిరిపోతుందని ఆయన తెలిపాడు. టాలీవుడ్ ప్రముఖ హీరో ఈ మూవీలో దాసరి నారాయణ రావు రోల్ చేస్తారని తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. మరి వేచి చూడాలి తెలుగు తెర మీద ఒక వెలుగు వెలిగిన దర్శకరత్న బయోపిక్ ఎలా ఉండబోతుందో…

Read more RELATED
Recommended to you

Latest news