ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వూలు జారీ చేసింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియాని బదిలీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేది పేరును కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడంతో ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా అందరి సహకారంతో నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ..ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని స్పష్టం చేశారు.