మీకు పీఎఫ్ ఖాతా ఉందా..? అయితే మీరు తప్పక వీటి కోసం తెలుసుకోవాలి. పీఎఫ్ అకౌంట్ ఉండి.. ప్రతి నెలా మీ వేతనం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతూ ఉంటే వీటి కోసం మీకు తెలియాలి. అటువంటి వాళ్లకి ఉచితంగానే రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..
ప్రతి నెలా మీ వేతనం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతూ ఉంటే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఉచితంగానే రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం వస్తుంది. పైగా దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ EDLI ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకవేళ కనుక నామినీ ఎవ్వరూ లేకపోతే భాగస్వామి లేదా పిల్లలకు ఈ డబ్బులు లభిస్తాయి. కరోనాతో మరణిస్తే కూడా వస్తాయ్.
పీఎఫ్ సబ్స్క్రైబర్లు ప్రమాదం, అనారోగ్యం కారణంగా మరణిస్తే వారి కుటుంబాలకు ఈ పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. బేసిక్ శాలరీ, డీఏకు 35 రెట్లు ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే బోనస్ కింద గరిష్టంగా రూ1.75 లక్షల వరకు పొందొచ్చు.
ఇది ఇలా ఉండగా గతంలో అయితే ఈ ఇన్సూరెన్స్ కవర్ మాక్సిమం రూ.6 లక్షలుగా ఉండేది. కేంద్రం ఇటీవలనే ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచింది కనుక ఇప్పుడు రూ.7 లక్షల వరకు వస్తోంది.
బేసిక్, డీఏ రూ.15 వేలు అయితే అప్పుడు ఇన్సూరెన్స్ కింద రూ.5.25 లక్షలు, బోనస్ రూ.1.75 లక్షలు ఇలా మొత్తంగా రూ.7 లక్షల వరకు పొందొచ్చు.