నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదాం : పవన్ కళ్యాణ్

-

నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది నెల్లూరు, ఇక్కడ చదువుకునే నేను సమాజాన్ని అర్దం చేసుకున్నాను, మహనీయుల స్ఫూర్తి తీసుకున్నాను. నేను ఇక్కడే ఫతేఖాన్ పేటలో తిరిగిన వాడిని అని పవన్ కళ్యాణ్ అన్నారు.నెల్లూరు సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….నేను తిరిగిన నెల్లూరు సింహపురి గడ్డ, ట్రంక్ రోడ్డు, నర్తకి సెంటర్ అంతా జ్ఞాపకం ఉన్నాయి, ఇంత ఘన స్వాగతం ఇస్తారని ఊహించలేదు అని పవన్ అన్నారు.

వచ్చేది కూటమి ప్రభుత్వమే, ప్రజా ప్రభుత్వం రాబోతుంది, ఖచ్చితంగా వైసిపి ఓడిపోతుంది, నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదాం అని పిలుపునిచ్చారు. నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరి సిటీ ఎమ్మెల్యే గా నారాయణ గారిని గెలిపించల్సిందిగా కోరుతున్నాను -నాకు జ్ఞానం నేర్పిన నేల నెల్లూరు, ఇక్కడే నా స్నేహితుడు, ఆర్యవైశ్యుడు రమేష్ అనే మిత్రుడి బుక్ శాప్ లో ఉన్న పుస్తకాలు నాకు జ్ఞానాన్ని అందించిది.ఈ దేశపు సంపద కలల ఖనిజాలతో నిండిన యువత, వారిని కాపాడుకోవాలి అని ప్రధాని మోడీ గారికి చెప్పాను. ఆయన విజన్ 2047 అని చెప్తుంటే నాకు యువ శక్తితో సూపర్ పవర్ గా ఎదుగుతుంది అని నమ్మకం ఉంది.మనకి 2 వారాల సమయం కూడా లేదు, మీరు తీసుకునే నిర్ణయం ఒక తరం కోసం ఆలోచించి తీసుకోవాలి, జగన్ వచ్చి 5 యేళ్లు అయింది, కాలం గిర్రున తిరిగిపోయింది, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news