ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కొలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ 169 పరుగులకు ఆలౌటైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది.తుషార బౌలింగ్‌లో నాలుగో బంతికి ఓపెనర్ సాల్ట్(5) వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ(13)ని తుషార బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
కష్టాల్లో ఆదుకుంటాడనుకున్న అయ్యర్(6) సైతం అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. దీంతో 28 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది.ఆపై కొద్దిసేపటికే హార్దిక్ బౌలింగ్‌లో నరైన్(8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రింకు సింగ్(8) పీయూష్ చావ్లా కి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 57 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 70, మనీశ్ పాండే 42 రాణించారు. 57 రన్స్‌కి ఐదు వికెట్లు కోల్పోయిన తమ జట్టుకు వీరిద్దరూ కలిసి గౌరవప్రదమైన స్కోరును అందించారు. ముంబై బౌలర్లలో తుషార 3, బుమ్రా 3, హార్దిక్ 2 వికెట్లు తీయగా, చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.