న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయమ్యాయి. లోక్ సభ్, రాజ్యసభ రెండు కూడా వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభయలు ప్రారంభంకావడంతో ఉపఎన్నికల్లో గెలిచిన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీగా గెలిచిన గురుమూర్తితో పాటు మరో ముగ్గురు ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇక సమావేశాలు ప్రారంభం కాగానే లోకసభలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. మోదీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయి. చమురు ధర పెంపునకు సంబంధించి చర్చ జరపాలని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్, ఆర్థిక వృద్ధి పతనంపై టీఎంసీ వాయిదా తీర్మానం పెట్టింది.
పార్లమెంట్ సమావేశాలకు మందు మోదీ ప్రసంగించారు. ఈ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ముఖ్యమైన బిల్లు అన్ని ఆమోదం కావాలని ఆకాంక్షించా