ఈ మధ్యకాలంలో నెట్టింట్లో ఫేక్ వార్తలు తెగ హల్చల్ అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించడం మొదలు అయ్యినప్పటి నుండి ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఈ తరహాలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
దీనిలో నిజం ఎంత అనేది మనం చూస్తే.. సెక్యూరిటీ ఫోర్స్ ఒక మనిషిని తీసుకు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో కనపడుతోంది. అయితే ఆ మనిషి మహిళా లాగ బట్టలు ధరించి ఉన్నాడు. అయితే ఈ ఫోటో భారతదేశంలోది అని.. ఆ ఉగ్రవాదిని పట్టుకున్నారని అంటున్నారు.
ఈ వార్తలో ఎంత నిజం వుంది అని పరిశీలిస్తే.. దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో హల్చల్ అవుతున్న ఈ ఫోటో కి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన సంఘటన ఇది అని తెలుస్తోంది.
పైగా ఇది 2012లోది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది భారత దేశంలో జరిగింది అని ఉగ్రవాదిని బీజేపీ పాలనలో పట్టుకున్నారని అంటున్నారు. నెట్టింట్లో ఈ ఫోటో తెగ షికార్లు కొడుతోంది.