నేతన్నలకు కేటీఆర్‌ శుభవార్త : రూ. 400 కోట్లతో కొత్త పథకం

-

రాబోయే రోజుల్లోనే రూ. 400 కోట్లతో వర్క్ టు ఓనర్ పథకాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ సిరిసిల్లా జిల్లాలోని అపెరల్ పార్క్ లో గోకుల్దాస్ ఇమేజెస్ వారి అపెరల్ పరిశ్రమకు భూమి పూజా కార్యక్రమాని మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల లో ఉన్న నేతన్న లకు మంచి రోజులు వచ్చాయని…అంతర్జాతీయ ప్రమాణాలతో అప్పెరాల్ పార్క్ లో వస్ర ఉత్పత్తి జరుగబోతుందని తెలిపారు.

ktr
ktr

నేతన్న ల సంపాదనతో సమానంగా వారి ఇళ్ళ లో ఉండే మహిళలకు అప్పేరాల్ పార్కు లో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. భారతదేశంలో అత్యుత్తమమైన పత్తి తెలంగాణ లో లభ్యం అవుతుందని.. వరంగల్ లో యంగ్ వన్స్ అనే సంస్థ ద్వారా వరంగల్ లో దాదాపు మూడువేల మందికి ఉపాధి రాబోతుందని వెల్లడించారు. ప్రభుత్వం చేనేత జౌళి శాఖ అభివృద్ధికి కట్టుబడి ఉందని… ఈ అపెరల్ పార్క్ ద్వారా దాదాపు పదివేల మందికి ఉపాధి రాబోతుందన్నారు. నేతన్నకు చేయుత అనే ప్రోగ్రాం ద్వారా 26 వేల కుటుంబాలకు 110 కోట్ల రూపాయలు కేటాయించామని.. 40 శాతం యారాన్ సబ్సిడీ ఇచ్చే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మర మగ్గలు వేలాది కోట్ల రూపాయలతో ఆధునిక రించామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news