కరోనా కంగారు తగ్గడం లేదు. చాలా మంది కరోనా మహమ్మారి ధాటికి బలైపోయారు. అనేక మంది ఆస్పత్రులలో చేరి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇంకా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా ను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక తాజాగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ గురించి చాలా ఆందోళన కర విషయాలు బయటపడ్డాయి.
రెండో వేవ్ ఇలా ముగిసిపోయిందని సంబరపడుతున్న వేళ.. ప్రస్తుతం మూడో వేవ్ భయాలు అందరినీ భయపెడుతున్నాయి. కొందరి నిర్లక్ష్యం కూడా థర్డ్ వేవ్ అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని భావించి కొందరు మాస్కులు పెట్టుకోకుండా కరోనా నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక మూడో వేవ్ కంటే ముందే డెల్టా వేరియంట్ సెగలు పుట్టిస్తోంది. ఇది మిగతా వేరియంట్ల కంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్ కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఇది వ్యాప్తి చెందడంలో అత్యంత ప్రమాదకరమైన చికెన్‌పాక్స్ కంటే వేగంగా ఉంటుందని వివరించారు. ఎటువంటి వ్యాక్సిన్లు వేయించుకున్నా… కూడా డెల్టా వేరియంట్ ముందు పని చేయవని వైద్యులు చెబుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాం ఇక ఏం కాదులే అనే అజాగ్రత్త కొంప ముంచుతుందని అంటున్నారు. ఇలా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరికైనా డెల్టా వేరియంట్ సోకితే చాలా ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. వైరస్ లోడ్ మూములు దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.