రైతులకు సిఎం కెసిఆర్ శుభవార్త.. ఆగస్టు 15 నుంచే రుణాల మాఫీ

-

సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం అయిన సాగతి తెలిసిందే.  ఈ సందర్భంగా వ్యవసాయం, రుణ మాఫీ పై దృష్టి సారించింది తెలంగాణ కేబినెట్. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై చర్చించింది. పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించిన కేబినెట్… తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్ ముందుంచింది ఆర్ధిక శాఖ. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు 50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ ఆదేశారు జారీ చేసింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారని కేబినెట్ అభిప్రాయ పడింది. అటు కేంద్రం ప్రవేశపెట్టిన ఇ బి సి రిజర్వేషన్ కోటాకు, విద్యా ఉద్యోగ అవకాశాలలో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఇబిసి కేటగిరి అభ్యర్థులు అర్హులు అని కేబినెట్ తీర్మానించింది. ఇబిసి కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితి లో 5 సంవత్సరాల సడలింపు నివ్వాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news