చెప్పుల్లో రెండు కిలోల బంగారం

-

gold biscuits found in chappals

చెప్పుల్లో రెండు కిలోల బంగారాన్ని పెట్టుకొని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 66 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. షార్జా నుంచి ఇండోర్ కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తి.. రెండు కిలోల బంగారం బిస్కెట్లను ఇంకో వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇండోర్ నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తుండగా… అనుమానం వచ్చిన అధికారులు.. అతడిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. దీంతో అతడి చెప్పుల్లో దాచిన రెండు కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించారు. దీంతో బంగారం బిస్కెట్లను సీజ్ చేసి అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news