అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ఛైర్మన్ అశోకగజపతిరాజు పై నమోదైన కేసులో తదనంతర ప్రక్రియ పై స్టే విధించింది హైకోర్టు. అశోకగజపతిరాజు, మరికొందరు మాన్సాస్ ఉద్యోగులపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు అశోక గజపతిరాజు. ఈరోజు హైకోర్టులో అశోకగజపతిరాజు తరపున సీనియర్ న్యాయవాది డి.వి. సీతారామ్మూర్తి, అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.
ఉద్యోగులు జీతాలు అడిగితే కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించిన సీతారామ్మూర్తి.. ఇ.ఓ జీతాలు విడుదల చేయడంలో విఫలమయ్యారని, జీతాలు అడిగితే కేసు నమోదు చేశారని హైకోర్టుకు వివరించారు. ఇక ఈ వాదనల అనంతరం ఈ కేసులో తదనంతర ప్రక్రియ పై స్టే విధించింది హైకోర్టు. మాన్సాస్ ఛైర్మన్ గా అశోక గజపతిరాజు పునర్నియామకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీరుపై డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు సంచయిత గజపతి. ఈ పిటీషన్ ను అనుమతించాలా? లేదా ? అనే దానిపై పదో తేదీన వాదనలు వింటామని పేర్కొంది డివిజనల్ బెంచ్.