బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యింది : మహేష్ గౌడ్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుంది అనేది.. ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలి అని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాం అని పేర్కొన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅని సూచించారు. ఇక అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి. బిజెపి, BRS కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

అయితే కార్యకర్త కూడా సీఎంని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందే. మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news