యూట్యూబ్ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. దీంతో టిక్‌టాక్ తర్వాత దీనికి మరింత క్రేజ్ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు అందించనుంది. సాధారణంగా ఇప్పటికే వీడియోలకు వ్యూస్ ఆధారంగా డబ్బు అందించే యూట్యూబ్ ఇప్పుడు ఈ షార్ట్ వీడియోల కోసం స్పెషల్ ఫండ్ కేటాయించింది. ప్రధానంగా యూట్యూబర్స్‌కు మరింత ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది.దీనికోసం యూట్యూబ్ దాదాపు 100 మిలియన్ డాలర్ల ఫండ్‌ను కేటాయించింది. 2021 –22 మధ్య వైరలైన షార్ట్ వీడియోల క్రియేటర్లకు ఈ ఫండ్ అందించనుంది.
కానీ, ప్రతిదానికి ఏదో ఒకటి మెలిక పెట్టే యూట్యూబ్ ఇప్పుడు ఈ ప్రోత్సాహకాల విషయంలో కూడా షార్ట్ వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకొని రివార్డులను అందిస్తామని కండిషన్ పెట్టింది. దీనికోసం ముందుగా షార్ట్ వీడియోలు అప్ లోడ్ చేసే క్రియేటర్లు బోనస్ చెల్లింపుల కోసం క్లెయిమ్ చేసుకోవాలని కోరింది.
దీనికి క్రియేటర్లు మొదటగా ప్రతి నెల వారు చేసిన షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యూట్యూబ్ నిబంధనల ప్రకారం వ్యూస్ విషయంలో క్వాలిఫై అవాల్సి ఉంటుంది. అలా అయినవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ ఫండ్ ను భారత్‌తో పాటు యూఎస్, బ్రెజిల్, యూకే, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికా క్రియేటర్లకు అందించనుండగా త్వరలోనే మిగతా దేశాల్లో కూడా ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేలా మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది.‘సూపర్ థ్యాంక్స్’ అనే ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూట్యూబర్లు మరింత డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది.