బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

rains-in-telanga
rains-in-telanga

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు గుర్తించారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయని.. అత్యధికంగా 1.4 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తిమ్మారావుపేటలో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 

వర్షాల నేపథ్యంలో వాతావారణ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల అధికారులకు సమాచారం అందించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని, కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.