గోల్డ్ మెడల్ విజేత నీరజ చోప్రాకు భారీ నజరానా

-

జావెలిన్ త్రో లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నాయకుల నుంచి అటు చిత్ర పరిశ్రమ ప్రముఖుల వరకు అందరూ గోల్డ్ మోడల్ విజేత నీరజ్ చోప్రా ను అభినందిస్తున్నారు. భారత దేశాన్ని ప్రపంచానికి మరోసారి గర్వపడేలా చూపించాడని కొనియా డుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నీరజ చోప్రాకు హర్యానా సర్కారు భారీ నజరానా ప్రకటించింది. రూ. 6 కోట్ల నగదు మరియు గ్రూప్ -1 క్యాడర్ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది హర్యానా సర్కార్. అలాగే 50 శాతం రాయితీతో కూడిన ఇంటిస్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు. అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news