ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. !

-

గత కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి తో పాటు ప్రకృతి విపత్తులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుస భూకంపాలు రావడం, పిడుగులు పడటం, వరదలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరోసారి భారీ భూకంపం వచ్చింది. ఫిలిప్పీన్స్ లో ఈ భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1 గా నమోదు అయింది. ఫిలిప్పీన్స్ లో పొందగిటాన్ కు 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్టు అమెరికా జియాలజీకల్ సర్వే స్పష్టం చేసింది.

earthquake
earthquake

65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియాలజీ సర్వే పేర్కొంది. అంతేకాకుండా అమెరికా పిలిప్పీన్స్ కు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే భూకంపం కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news