కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశం మొత్తంలో కేరళలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా దేశంలో వస్తున్న మొత్తం కేసులలో కేరళ నుండి సగం కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు తాజాగా కేరళ కు మరో తలనొప్పి మొదలైంది. కేరళ రాష్ట్రంలో కొత్తరకం మ్యూటెంట్ ను వైద్య నిపుణులు గుర్తించారని తెలుస్తోంది. తొమ్మిది జిల్లాల్లో కొత్త మ్యూటెంట్ గుర్తించినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు.
దాంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యింది. పూర్తిస్థాయి నిర్ధారణ కోసం షాంపుల్స్ ను జినో మిక్స్ కన్సార్టియానికి పంపాలని సూచించింది. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజే కేరళ రాష్ట్రంలో 22,500 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా రాష్ట్రంలో 116 మంది కరోనాతో మరణించారు. మరో వైపు కేరళ లో ఆర్ వ్యాల్యు ఒకటి కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 16 శాతం కంటే ఎక్కువ కొనసాగుతోంది. ఇక కరోనా అదుపు చేయడానికి పినరయి సర్కార్ తగిన చర్యలు తీసుకుంటోంది.