జూన్‌ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి : సీఎం జగన్

-

జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలని.. అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని తెలిపారు.

అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని.. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని.. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమగ్ర సర్వేపై సమీక్షచేస్తానని వెల్లడించారు. అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్షచేస్తానని… వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్ష చేయాలని తెలిపారు. సమగ్ర సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని… సర్వే ఆఫ్‌ ఇండియా సహకారాన్ని తీసుకోవాలని పేర్కొన్నారు సీఎం జగన్‌. ఈ వ్యవహారాన్ని విజయ వంతం చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news