మాజీ మంత్రి ఈటల రాజేందర్.. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కు కౌంటర్ ఇచ్చారు. నిన్న హరీష్ రావు చేసిన విమర్శల పై అబిడ్స్ లో చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు. విమర్శలపై అబిడ్స్ కు హరీష్ రావులన్నారు. ఎవరిది తప్పు ఐతే వారికి శిక్ష పడుతుందని ఫైర్ అయ్యారు.
తన ఆస్తుల పై విచారణకు రెడీగా ఉన్నానని చెప్పిన ఈటల రాజేందర్.. సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ తో విచారణ చేద్దామని పేర్కొన్నారు. పార్టీలో చేరినపుడు ఇప్పుడు ఉన్న ఆస్తులు లెక్క తెలుద్దామని ఫైర్ అయ్యారు. మీ ఆస్తులపై కూడా విచారణకు సిద్ధమా ? అని మంత్రి హారీష్ రావు కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. నేను అభివృద్ది చేయలేదు అంటున్నారని… మీరు తిరుగుతున్న రోడ్లు నేను వేపించినవేనని చురకలు అంటించారు ఈటల రాజేందర్. విమర్శలు వ్యక్తి గత పరంగా చేయడం దారుణమని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. హుజురాబాద్ ప్రజలు తన వైపే ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు.