విజయవాడ : ఆరుగురు కీలకమైన మావోయిస్టులు లొంగిపోయారని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. ఏఓబీ లో మావోయిస్టు పరిస్ధితులను గత నెల లో సరెండర్ అయిన స్పెషల్ జోనల్ కమాండర్ చెప్పారని… ఈ నేపథ్యంలో ఒక డివిజనల్ కమాండర్, ఇద్దరు కమాండర్లు, ముగ్గురు ఇతర మెంబర్లు లొంగిపోయారని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు.
గత నెలలో లొంగిపోయిన స్పెషల్ జోనల్ కమాండ్ చెప్పిన… వివరాల కారణంగా మిగతా వారి వివరాలు తెలిశాయన్నారు డీజీపీ. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్ మెన్లు ఉన్నారని తెలిపారు. స్థానిక సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం తో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందన్నారు. భూమి సమస్యలు కూడా ఇప్పుడు లేవని… 19,919 కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆదివాసీ ప్రాంతలకు చేరుతున్నాయని వెల్లడించారు డీజీపీ గౌతం సవాంగ్. ఇక మిగతా మావోయిస్టుల పై కూడా ప్రస్తుతం నిఘా పెట్టామని చెప్పారు.