కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. నీటి కేటాయింపులు ఆపాల్సిందే..!

-

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని…  బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలని లేఖలో పేర్కొంది తెలంగాణ సర్కార్‌. నీటి కేటాయింపులు లేని HNSS ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలని..సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 TMC ల నీటి కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 TMC ల తుంగభద్ర జలాలు తరలిస్తున్నారని తెలిపింది.

RDS కు 15.90 TMC కేటాయింపులు ఉండగా సరాసరి 5 TMCలకు మించి తరలించడం సాధ్యం కావడంలేదని లేఖలో వివరించింది. తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమమని.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 TMC లు మాత్రమే తరలించాలని వెల్లడించింది. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిఫ్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నదని… కావున ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను KRMB నిరోధించాలని కోరింది తెలంగాణ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news