మరో నాలుగు నెలల్లో పిల్లలకు కొత్త వ్యాధి : ఆరోగ్య శాఖ హెచ్చరికలు

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క‌రోనా ఫ‌స్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ ల‌తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మ‌రోవైపు ఆగస్టు తర్వాత థర్డ్ వేవ్ రూపంలో పిల్లలకు కరోనా సోకే అవకాశాలు ఉన్నాయ‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కరోనా టెన్షన్ లో ఉన్న ప్రజలకు ఆరోగ్య శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది.

వచ్చే నాలుగు నెలల్లో చిన్న పిల్లలకు పోలియో లాంటి అక్యూట్ ఫ్లాసిడ్ మైలిటిస్ (AFM) అనే వ్యాధి వ్యాప్తి చెందుతుందని యునైటెడ్ స్టేట్స్ ఆరోగ్య శాఖ పేర్కొంది.  ఈ వ్యాధి నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసింది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి). “ఆకస్మిక అవయవ బలహీనత కలిగిన రోగులలో, ముఖ్యంగా ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య afm సోకే అవకాశం ఉందనిి పేర్కొందిి. నేపథ్యం లో తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేసింది అరోగ్య శాఖ.

అలాగె  ఇటీవల   కాలంలో శ్వాసకోశ అనారోగ్యం లేదా జ్వరం మరియు మెడ లేదా వెన్నునొప్పి లేదా ఏదైనా నరాల బలహీనత లక్షణాలు ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. AFM అనేది మెడికల్ ఎమర్జెన్సీ, కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా తొందరగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. అయితేే ఈ వ్యాధి వచ్చే నాలుగు నెలల్లో వ్యాపించే ప్రమాదం ఉందని…కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చ‌రించింది.

Read more RELATED
Recommended to you

Latest news