తిరుమలకు వెళ్లే వారికి బిగ్ అలర్ట్..దర్శనాలపై కీలక అప్డేట్ వచ్చింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమలలో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

అటు నిన్న 84066 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 29044 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.02 కోట్లుగా నమోదు అయింది.
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. తిరుమలలోని మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అధికారులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. కొండచిలువను స్నేక్ క్యాచర్ మొదటి ఘాట్ రోడ్ లో వదిలేశారు.