ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య, జీవిత బీమా తీసుకొని ఉండడం మంచిది. అయితే సాధారణంగా తీసుకునే బీమాకి అన్ని రకాల సదుపాయాలు ఉండకపోవచ్చు.జీవిత బీమా పాలసీలను అందించే ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్ ఒక ప్రత్యేకమైన ‘న్యూ ఏజ్ ప్రొటెక్షన్’ ప్రొడక్ట్‌ను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ లైఫ్ ఇ–షీల్డ్ నెక్ట్స్ పేరుతో ప్రారంభించిన ఈ పాలసీ.. వినియోగదారుల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు రక్షణ కవరేజీని అందిస్తోంది. ఈ పాలసీ నాన్ ఇండివిడ్యువల్, నాన్– లింక్డ్, నాన్– పార్టిసిపేటింగ్ రిస్క్ ప్రీమియం ప్రొడక్ట్ అని కంపెనీ పేర్కొంది. దీంతో స్టాక్ మార్కెట్‌కు ఏ లింక్ కాదు.
పాలసీ తీసుకున్న వారు భవిష్యత్తులో పెళ్లి, పిల్లలు, సొంత ఇల్లు.. వంటి అవసరాలకు తగ్గట్లు బీమా కవరేజీని ప్రస్తుత పాలసీ పెంచుతుంది. దీంతో ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఇందులో మూడు ఆప్షన్లు ఉన్నాయి.
లెవల్ కవర్ బెనిఫిట్..
ఈ పాలసీని ఎంచుకున్న వారికి.. అమల్లో ఉన్నంత వరకు హామీ ఇచ్చిన మొత్తం స్థిరంగా ఉంటుంది.
కవర్ బెనిఫిట్..
ఇందులో పాలసీదారులు చనిపోతే ఇచ్చే హామీ మొత్తం, బీమా చేసిన మొత్తంపై ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు ప్రతి ఐదేళ్లకు ఒకసారి అమల్లోకి వస్తుంది. గరిష్టంగా 100 శాతం వరకు పెరుగుతుంది.
లెవల్ కవర్ విత్ ఫ్యూచర్ బెనిఫిట్ ప్రూఫింగ్..
పాలసీదారుడు పెళ్లి, పిల్లలు లేదా ఇల్లు కొనడం వంటి ముఖ్యమైన అవసరాలకు తగ్గట్లు పాలసీ కవరేజీని ఈ ఆప్షన్ పెంచుతుంది. ఈ సదుపాయం పాలసీ వ్యవధిలో ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.