సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

-

ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ లేఖలో నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాలలు పునప్రారంభం రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్ల ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని.. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై బలవన్మరణం చెందారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుగానే అర్ధవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదని మండిపడ్డారు. ఏపీలో దాదాపు 12,000 కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని.. మార్చి 2020 లో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవన్నారు. గత 5 నెలల్లో, పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు భరించారని  పేర్కొన్నారు నారా లోకేష్. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news