అక్కినేని ఫ్యాన్స్‌కు కాజల్‌ స్పెషల్ గిఫ్ట్

-

అక్కినేని ఫ్యాన్స్‌ కు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది. ఆదివారం కింగ్‌ నాగార్జున బర్త్‌ డే అన్న సంగతి తెలిసిందే. అయితే… ఈ నేపథ్యం లో స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌ ను రివీల్‌ చేసింది కాజల్‌ అగర్వాల్‌. కింగ్‌ నాగార్జున హీరో గా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శ కత్వం లో ఓ సరికొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా లో కాజల్‌ అగర్వాల్‌.. హీరోయిన్‌ గా నటిస్తుండగా… ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు టైటిల్‌ పోస్టర్‌ ను కాజల్‌ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ది ఘోస్ట్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇక ఇందులో నాగార్జున మరింత యంగ్‌ మరియు సీరియస్‌ లుక్‌ లో కనిపించారు. అంతేకాదు.. కత్తి చేతపట్టి… రౌడీల పాలిట ఘోస్ట్‌ ల ప్రత్యక్ష మయ్యారు కింగ్‌ నాగార్జున. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఈ అప్డేట్‌ చూసి… అక్కినేని ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news