ఆ విషయంలో కేసీఆర్ ఫెయిల్…ఈ సారి భారీ షాక్ తప్పదా….

-

రాజకీయాల్లో నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలని తప్పితే, తర్వాత ఎలాంటి పరిణామాలని ఎదురుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏదో ఒకప్పుడు హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ప్రజలు పట్టించుకోని రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు ప్రతిదీ పట్టించుకుంటున్నారు. పైగా ప్రతి అంశాన్ని గుర్తు చేయడానికి మీడియా ఉంటుంది. అయితే ఇచ్చిన హామీ అమలు చేయకుండా అన్నిరోజులు రాజకీయంగా మనుగడ సాగించడం కష్టం.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇప్పుడు ఇదే ఫార్ములా తెలంగాణలో ఉన్న కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి వర్తిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్, ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. కానీ మళ్ళీ ఎన్నికలోచ్చేసరికి అన్నీ హామీలని కే‌సి‌ఆర్ అమలు చేయలేదు. ఉదాహరణకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటింటికి వాటర్ కనెక్షన్. అయినా సరే 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో కే‌సి‌ఆర్ మరొకసారి విజయం సాధించేశారు.

ఇక ఈ సారి అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్ మళ్ళీ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. అయితే వీటిల్లో కొన్ని అమలు చేస్తున్నారు. కొన్ని అమలు కావడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగులని ఆదుకోవడం కోసం ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ. గత ఎన్నికల సందర్భంగా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని కే‌సి‌ఆర్ హామీ ఇచ్చారు.

కానీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటేసిన కూడా నిరుద్యోగ భృతి హామీ ఏమైందో ఎవరికి తెలియదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా నిరుద్యోగ భృతి ‌పై కే‌సి‌ఆర్ మాట్లాడుతూ…క‌రోనా కార‌ణంగా నిరుద్యోగ భృతి ఇవ్వ‌లేక‌పోయామ‌ని,  నిరుద్యోగుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామని త్వరలోనే భృతి ఇస్తామని అన్నారు. కానీ ఇంతవరకు ఆ కార్యక్రమం జరగలేదు. ఇదే అంశంపై ఇప్పుడు ప్రతిపక్షాలు, కే‌సి‌ఆర్‌ని టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నాయి. పైగా ఉద్యోగాల భర్తీపై కూడా నిరుద్యోగుల్లో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది. ఈ రెండేళ్లలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే, నెక్స్ట్ ఎన్నికల్లో కే‌సి‌ఆర్‌కు భారీ షాక్ తప్పదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news