పారిశ్రామికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తూ.. ఏపీలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్ కు ఊత మిస్తూ… ప్రోత్సహకాలను విడుదల చేయనుంది ఏపీ సర్కార్. గత ప్రభుత్వం 2015 నుంచి ఎంఎస్ఎంఈలకు బకాయి పెట్టిన రూ. 904 కోట్లు స్పిన్నింగ్ మిల్స్ కు బకాయి పెట్టిన రూ. 684 కోట్లు మొత్తం రూ. 1588 కోట్లు బకాయిలు సైతం జగన్ సర్కార్ చెల్లించనుంది.
రూ. 25,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేలా కొప్పర్తిలో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను 3,155 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్, నీరు, సీఈటీపీలు మరియు ఎస్టీపీల వంటి అత్యున్నత మౌలిక సదుపాయాలతో బహుళ ఉత్పత్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్‌గా ప్రభుత్వం అభివృద్ది చేస్తుంది. తద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ. 10,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడానికి కొప్పర్తిలో రూ. 730.50 కోట్ల పెట్టుబడితో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30,000 మందికి ఉపాధి కలుగనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న క్రియాశీలక చర్యలతో, రూ. 5,204.09 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన 16,311 ఎంఎస్ఎంఈలు అదనంగా 1,13,777 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.