ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఉండటం ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. ఆధార్ కార్డు ఉండడం వలన ఎన్నో ప్రయోజనాలని మనం పొందుచు. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ దాంట్లో ఆధార్ కార్డు చాలా అవసరం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజంగా ఆధార్ కార్డు ప్రాధమిక అవసరంగా మారింది. అదే విధంగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆధార్ కార్డే మీకు గుర్తింపుకు ఆధారంగా మారుతుంది. ఇలా ఎన్నో వాటికి ఆధార్ తప్పక ఉండాలి.
ఇది ఇలా ఉంటే ఎప్పటికప్పుడు ఆధార్ కి సంబంధించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ఆధార్ కి సంబంధించి మరో కొత్త అప్డేట్ వస్తోందని సమాచారం. ఆధార్ లో మరో టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆధార్ లో మరో కొత్త టెక్నాలజీ త్వరలో వస్తోంది. ముఖ గుర్తింపు (ఫ్యేషియల్ రికగ్నైజేషన్) ద్వారా ఆధార్ నమోదు సౌకర్యాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆధార్ సీఈఓ సౌరవ్ గార్గ్ తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3.56 కోట్ల మంది తమ ఆధార్ కార్డ్ ని మొబైల్ తో లింకు చేసుకున్నారు. 96.8 శాతం మందికి ఆధార్ నమోదు పూర్తయిందని తెలిపారు.