ఏపీలో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. APEPDCL తన పరిధిలోని ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఎలక్ట్రికల్, వైరింగ్‌ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లయెన్సెస్‌ విభాగం లో రెండేళ్ల ఒకేషనల్‌ ఇంటర్మీడియెట్‌ కోర్సు చేసిన పురుషులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు.

job
job

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఫిట్నెస్ టెస్ట్ కి పిలవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్‌ 24, 2021.

రాత పరీక్ష అక్టోబర్‌ 10 న ఉంటుంది. (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు). ఇది ఇలా ఉంటే ఫిజికల్‌ టెస్ట్‌ (విద్యుత్‌ స్తంభం ఎక్కడం, మీటర్‌ రీడింగ్‌ చూడటం, సైకిల్‌ తొక్కడం). నవంబర్‌ 1 నుంచి 6 వరకు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.apeasternpower.com/ వెబ్‌సైట్‌ లో చూసి.. అప్లై చేసుకోచ్చు.

పోస్టుల వివరాలు:

శ్రీకాకుళం – 88
విజయనగరం – 74
విశాఖపట్నం – 71
రాజమండ్రి – 122
ఏలూరు – 43